సుధీర్ బాబు 'శ్రీదేవి సోడా సెంటర్'

October 30, 2020


img

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సుధీర్ బాబు. V సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన సుధీర్ బాబు తన నెక్స్ట్ సినిమా పలాస డైరక్టర్ కరుణ కుమార్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. సుధీర్ బాబు నెక్స్ట్ మూవీ టైటిల్ శ్రీదేవి సోడా సెంటర్. టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా అదిరిపోయింది.    

సినిమాలో లైటింగ్ సూరి బాబుగా సుధీర్ కనిపిస్తారని తెలుస్తుంది. ఈ లైటింగ్ సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ దగ్గర చేసే హంగామా ఏంటన్నది సినిమాలో చూడాల్సిందే. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో టేస్ట్ ఉన్న నిర్మాతలుగా ప్రూవ్ చేసుకున్న ఈ నిర్మాతలు ఈసారి సుధీర్ బాబు, కరుణ కుమార్ కాంబోలో సినిమా చేస్తున్నారు.      



 


Related Post

సినిమా స‌మీక్ష