కపటదారి టీజర్.. ఇంప్రెస్ చేసింది..!

October 29, 2020


img

సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి డైరక్షన్ లో వస్తున్న సినిమా కపటదారి. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు. కన్నడ సినిమా కవలుదారి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక ఏదో ఒక బలమైన కారణంతో ఈ సినిమా వస్తుంది. టీజర్ చూస్తే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది.      

సినిమాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. సినిమా టీజర్ మాత్రం ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదం జగత్ సినిమాతో నిరాశపరచిన సుమంత్ కపటదారితో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.  





Related Post

సినిమా స‌మీక్ష