బుల్లితెరపై సాహో డిజాస్టర్..!

October 29, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమా సాహో. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబడింది. బాహుబలి రెండు పార్టులతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ సాహోతో ఆ రికార్డులు బ్రేక్ చేస్తాడని అనుకోగా నిరాశపరచాడు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే రాగా నార్త్ సైడ్ మాత్రం ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

ఇక ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటలేదు స్మాల్ స్క్రీన్ పై అయినా సూపర్ హిట్ అవుతుందని భావించగా అక్కడ డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా స్మాల్ స్క్రీన్ పై వరల్డ్ ప్రీమియర్ గా సాహో టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు కేవలం 5.8 టి.ఆర్.పి రేటింగ్స్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమా రెండోసారి మూడవసారి వచ్చే రేటింగ్ సాహో సినిమాకు మొదటిసారి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన ఈ సినిమా బుల్లితెర మీద కూడా డిజాస్టర్ గా మిగిలింది. 



Related Post

సినిమా స‌మీక్ష