పండుగ స్పెషల్.. బిగ్ బాస్ లో సమంత..!

October 24, 2020


img

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. మనాలిలో జరుగుతున్న ఈ షూటింగ్ కోసం 21 రోజుల డేట్స్ ఇచ్చారు నాగార్జున. ఇక ఈ షెడ్యూల్ టైం లో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కనిపించే ఛాన్స్ లేదు. అందుకే నాగార్జున బదులుగా అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ గా వస్తున్నారు.

అసలైతే శనివారం ఎపిసోడ్ లోనే హోస్ట్ రావాల్సి ఉంది కాని ఈసారి పండుగ స్పెషల్ గా ఆదివారం రోజు సమంత హోస్ట్ చేస్తున్న ఎపిసోడ్ ఇస్తున్నారు. అంతేకాదు ఈ షో ఆదివారం పండుగ సందర్భంగా సాయంత్రం 6 గంటలకే వస్తుందని ఎనౌన్స్ చేశారు. మొత్తానికి బిగ్ బాస్ రేటింగ్ పెంచేందుకు జబర్దస్త్ ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండదనే టాక్ వినిపిస్తుంది. మామ బదులుగా కోడలు హోస్ట్ గా బిగ్ బాస్ లో సమంత హంగామా ఎలా ఉంటుందో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష