కాజల్ ఇలా భయపెడుతుందేంటి..!

October 23, 2020


img

కరోనా లాక్ డౌన్ వల్ల ఓటిటిల్లో సినిమాలే కాకుండా వెబ్ సీరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. టాలెంట్ ఉండి అవకాశాలు రాని వారే కాదు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న వారు కూడా వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లను చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సీరీస్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తుండగా వారిలో కాజల్ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి అడుగుపెట్టింది.

డిస్నీ హాట్ స్టార్ కోసం కాజల్ చేస్తున్న వెబ్ సీరీస్ లైవ్ టెలికాస్ట్. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ వెబ్ సీరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లైవ్ టెలికాస్ట్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఈ వెబ్ సీరీస్ తో కాజల్ భయపెట్టించేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. వెంకట్ ప్రభు డైరక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సీరీస్ హాట్ స్టార్ ఒరిజినల్స్ లో రానుంది. 



 


Related Post

సినిమా స‌మీక్ష