పవన్, రానా.. కాంబో కుదిరిందా..?

October 23, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటుగా వరుసగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. వేణు శ్రీరాం డైరక్షన్ లో వకీల్ సాబ్ మరో నెల రోజుల షూటింగ్ తో పూర్వుతుందని తెలుస్తుండగా ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతారని టాక్. ఇక హరీష్ శంకర్ డైరక్షన్ లో కూడా ఒక సినిమా ఉంది. 

ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో కూడా పవర్ స్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలతో పాటుగా మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా పవన్ నటిస్తాడని టాక్. పృధ్వి రాజ్, బిజూ మీనన్ కాంబోలో వచ్చిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. తెలుగు రీమేక్ లో పవన్, రానా దాదాపు కన్ఫాం అయినట్టే అంటున్నారు. ఈ రీమేక్ లో రానా ముందునుండి చేస్తున్నాడని తెలుస్తుండగా.. ఇప్పుడు పవన్ కూడా ఈ సినిమాను చేస్తాడని టాక్.  



Related Post

సినిమా స‌మీక్ష