సన్ ఆఫ్ ఇండియా మొదలైంది..!

October 23, 2020


img

కలక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ లో వస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డేశభక్తి ప్రధానంగా వస్తుంది. సన్ ఆఫ్ ఇండియా టైటిల్ చూస్తేనే సినిమా కంటెంట్ ఏంటన్నది తెలుస్తుంది. ఈ సినిమా ఈరోజు మోహన్ బాబు నివాసంలో షూటింగ్ మొదలుపెట్టారు. 

కొన్నాళ్లుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన మోహన్ బాబు లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాను మంచు ఫ్యామిలీ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకు కాస్టూం డిజైనర్ గా మంచు విష్ణు భార్య విరానిక వ్యవహరిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా మోహన్ బాబు కెరియర్ లో స్పెషల్ మూవీగా ఉంటుందని అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష