నారప్ప షూటింగ్ స్టార్ట్..!

October 22, 2020


img

విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ నారప్ప. తమిళంలో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ కు ముందు వరకు 60 శాతం వరకు షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా మళ్లీ తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

అసలైతే 2021 జనవరి వరకు ఎలాంటి షూటింగ్స్ వద్దని చెప్పిన వెంకటేష్ మిగతా సినిమాలన్ని సెట్స్ మీదకు వెళ్లగా మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ 5 నుండి నారప్ప షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ షెడ్యూల్ లో ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేస్తారని టాక్. మొత్తానికి నవంబర్ నుండి నారప్ప రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాడు.  Related Post

సినిమా స‌మీక్ష