బిగ్ బాస్ హోస్ట్ గా సమంత..?

October 22, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. సీనియర్ హీరోలెవరు చేయలేని ఈ సాహసాన్ని చేస్తూ నాగ్ మరోసారి తన సత్తా చాటుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా చేసిన నాగ్ సీజన్ 4కి కొనసాగుతున్నారు. అయితే సీజన్ 3లో జరిగిన ఓ సీన్ ను సీజన్ 4లో కూడా రిపీట్ చేస్తున్నారని తెలుస్తుంది. 

అదేంటి అంటే సీజన్ 3లో నాగ్ ఒక వీకెండ్ డుమ్మా కొట్టారు. నాగ్ ప్లేస్ లో శివగామి రమ్యకృష్ణ వచ్చి అలరించింది. ఇక సీజన్ 4లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందట. అయితే ఈసారి రమ్యకృష్ణ బదులుగా అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా వస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4లో సమంత సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. మరి హోస్ట్ గా సాం ఎలా అలరిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష