టక్ జగదీష్ ఆగిపోలేదా..?

October 22, 2020


img

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టక్ జగదీష్. కరోనా లాక్ డౌన్ కు ముందు షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. అయితే చిత్రయూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో టక్ జగదీష్ షూటింగ్ ఆగిపోయిందని అన్నారు. కాని టక్ జగదీష్ షూటింగ్ కు ఎలాంటి అంతరాయం కలుగలేదని తెలుస్తుంది.

ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ డైరక్టర్ శివ నిర్వాణ అన్ స్టాపబుల్ అంటూ ట్వీట్ చేసి షూటింగ్ స్పాట్ లో శానిటైజ్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు. సో అనుకున్నట్టుగా టక్ జగదీష్ షూటింగ్ ఆగిపోలేదని తెలుస్తుంది. నానితో ఆల్రెడీ నిన్నుకోరి సినిమా చేసిన శివ నిర్వాణ రెండో సినిమాగ టక్ జగదీష్ చేస్తున్నాడు.Related Post

సినిమా స‌మీక్ష