చరణ్ లైన్ లో త్రివిక్రం..!

October 22, 2020


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ ఆచార్య సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట రాం చరణ్. ఆచార్య తర్వాత కొరటాల శివతోనే చరణ్ సినిమా ఉంటుందని టాక్.

ఇక ఈ సినిమా తర్వాత మాటల మాత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో చరణ్ సినిమా ఉంటుందని అంటున్నారు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రం.. ఈ సినిమా తర్వాత చరణ్ ను లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రం తో మహేష్ బాబు కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఎన్.టి.ఆర్, మహేష్, చరణ్ వరుస స్టార్ సినిమాలతో త్రివిక్రం మళ్లీ తన ఫాం కొనసాగించనున్నాడు.Related Post

సినిమా స‌మీక్ష