వాడు కనబడితే సముద్రాలు తడబడాయ్.. కొమరం భీమ్ టీజర్ అదుర్స్..!

October 22, 2020


img

కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్.ఆర్.ఆర్ కొమరం భీమ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమా నుండి కొమరం భీమ్ టీజర్ రిలీజైంది. రామరాజు ఫర్ భీమ్ అంటూ చరణ్ వాయిస్ తో కొమరం భీమ్ టీజర్ వచ్చింది.

వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి అంటూ చరణ్ వాయిస్ ఓవర్ కు.. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అనేలా ఉంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమరం భీమ్ పాత్రలో తారక్ ఇద్దరు నువ్వా నేనా అనేలా పోటీ పడి మరి నటించారని తెలుస్తుంది. కొమరం భీమ్ టీజర్ తో ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు డబుల్ చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష