సుడిగాలి సుధీర్ కు కరోనా..?

October 21, 2020


img

ఈటివి జబర్దస్త్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కు కరోనా పాజిటివ్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుధీర్ అన్ హెల్తీగా ఉన్నాడని ఆదివారం అతనికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. సుధీర్ సన్నిహితులు కూడా ఇది నిజమే అన్నట్టుగా చెబుతున్నారట. అయితే దసరా ఈవెంట్ లలో సుధీర్ సందడి చేశాడు. ఈటివిలో అక్కా ఎవరే అతగాడు స్పెషల్ షోలో సుధీర్ పర్ఫార్మ్ చేశాడు.  

ఒకవేళ సుధీర్ కు నిజంగానే కరోనా పాజిటివ్ వస్తే ఈ షోలో పాల్గొన్న వారు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సుధీర్ కు కరోనా అని తెలియగానే మిగతా షో మెంబర్స్ అంతా ఎలర్ట్ అయినట్టు తెలుస్తుంది. సుధీర్ ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంపై అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష