అభిమానుల కోరిక మేరకు..!

October 17, 2020


img

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సినిమా టీజర్ గురించి గూగుల్ లో కూడా సెర్చ్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే అభిమానుల కోరిక మేరకు అఖిల్ బ్యాచ్ లర్ సినిమా నుండి టీజర్ రాబోతుందని తెలుస్తుంది. ఈ నెల 19న ఉదయం 9:39 గంటలకు ప్రీ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

అక్కినేని హీరోగా చేసిన మూడు సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న బ్యాచ్ లర్ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. పూజా హెగ్దే గ్లామర్ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా అయినా అఖిల్ కోరిక తీరుస్తుందో లేదో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష