నాని టక్ జగదీష్ టీం లో కరోనా కలకలం..!

October 17, 2020


img

నాచురల్ స్టార్ నాని శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. దానితో చిత్రయూనిట్ మొత్తం హోం ఐసోలేషన్ కు వెళ్లారని తెలుస్తుంది. నాని సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. నాని హీరోగా వచ్చిన నిన్నుకోరి సినిమాతో డైరక్టర్ గా మొదటి సినిమానే సక్సెస్ అందుకున్న శివ నిర్వాణ తన సెకండ్ సినిమా మజిలీ కూడా హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మూడవ సినిమా నానితో చేస్తున్నాడు.

టక్ జగదీష్ సినిమాలో నానితో పాటుగా జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నానికి జోడీగా ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాని శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష