నితిన్ జోరు మీదున్నాడు

October 16, 2020


img

ఈ ఇయర్ మొదట్లోనే భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత రంగ్ దే అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ ఈమధ్య రిలీజ్ అయ్యింది. మనమంతా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చెక్ తో నితిన్ మరోసారి తన మాస్ యాంగిల్ చూపించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా మరో షెడ్యూల్ త్వరలో మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది. రంగ్ దే కోసం మొన్నటిదాకా కష్టపడ్డ నితిన్ త్వరలోనే చెక్ కోసం రెడీ అవుతున్నాడు. నితిన్ స్పీడ్ చూస్తుంటే 2021 మొత్తం తన సినిమాలతో హంగామా చేసేలా ఉన్నాడు.Related Post

సినిమా స‌మీక్ష