మంచు హీరోకి వెంకటేష్ సాయం..!

October 16, 2020


img

టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ చాలా స్పెషల్. సినిమాకు సంబందించి ఎలాంటి సయాన్ని అడిగినా ఆయన కదనకుండా చేస్తారు. ఎలాంటి ఈగోలు గట్రా లేకుండా అందరితో ఈక్వల్ గా ఉంటాడని వెంకటేష్ కు మంచి ఇమేజ్ ఉంది. ఆయన వల్లే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. మళ్ళీ తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే. వేరే సినిమాలకు సాయం చేయడంలో కూడా ముందుంటాడు వెంకటేష్. మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

వెంకటేష్ వాయిస్ ఓవర్ చెబుతున్న పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు మంచు విష్ణు. మోసగాళ్లు సినిమాలో విష్ణు, కాజల్ అన్నా చెల్లెల్లుగా నటిస్తున్నారు. అతిపెద్ద ఐటి స్కాం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మరి వెంకటేష్ వాయిస్ ఓవర్ తప్పకుండా మోసగాళ్లు సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష