నితిన్ మొదలు పెట్టాడోచ్..!

September 23, 2020


img

యువ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి మొన్నామధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈరోజు నుండి రంగ్ దే షూటింగ్ మొదలైంది. షూటింగ్ స్పాట్ లో దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఇయర్ మొదట్లో భీష్మతో హిట్ అందుకున్న నితిన్ రంగ్ దేతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు. సినిమాలో నితిన్, కీర్తి సురేష్ ల జోడీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా ఓటిటి రిలీజ్ ఆఫర్స్ వస్తున్నా నితిన్ వాటిని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష