బిగ్ బాస్ 4లో మరో వైల్డ్ కార్డ్..?

September 23, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4లో జరిగిన రెండు వారాల్లోనే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి వారంపూర్తి కాగానే కుమార్ సాయి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సెకండ్ వీక్ లో జబర్దస్త్ కమెడియన్ అవినాష్ కూడా హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. జోకర్ గా హౌజ్ లో ఎంట్రీ ఇచ్చి వచ్చిన దగ్గర నుండి హౌజ్ లో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు అవినాష్. 

ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ గ్లామర్ డోస్ బాగానే ఉంది. హారిక, దివి, మోనాల్ ఇలా ముద్దుగుమ్మలు తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంటే ఇప్పుడు మరో భామ హౌజ్ లో గ్లామర్ షో చేసేందుకు వస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ వారం ఉండబోతుందని తెలుస్తుంది. జంప్ జినాలి, చిత్రాంగధ సినిమాల్లో నటించిన స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ సీజన్ 4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క ఐపిఎల్ సీజన్ స్టార్ట్ అవగా తెలుగు ఆడియెన్స్ బిగ్ బాస్ చూసేలా అదిరిపోయే ప్లాన్స్ వేస్తున్నారు.    Related Post

సినిమా స‌మీక్ష