డ్రగ్స్ కేసులో మహేష్ భార్య..?

September 23, 2020


img

రియా డ్రగ్స్ కేసు తాకిడి టాలీవుడ్ కు తాకింది. రియా ఎన్.సి.బికి ఇచ్చిన లిస్ట్ లో రకుల్, సారా ఆలి ఖాన్ ల పేర్లు ఉన్నాయని మీడియా హడావిడి చేసింది. అయితే రియా తమకు ఎవరి పేర్లు చెప్పలేదని ఎన్.సి.బి క్లారిటీ ఇచ్చేసరికి అందరు సైలెంట్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా చాట్ లిస్ట్ లో ఎన్ పేరుతో చేసిన చాటింగ్ బయటకు వచ్చింది. MD అందాక పార్టీ చేసుకుందా అన్న చాట్ ను బేస్ చేసుకుని ఎన్ అనే పేరు గల వ్యక్తికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు చెబుతున్నారు.            

అయితే ఎన్ అంటే నమ్రత శిరోద్కర్ అని ముంబై మీడియా ప్రచారం మొదలుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రతని కూడా డ్రగ్స్ కేసులో లాగేందుకు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఆల్రెడీ నమ్రత టీం రంగంలోకి దిగింది. నమ్రతకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మహేష్ ఫ్యాన్స్ నమ్రతకు సపోర్ట్ గా నిలిచారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తనకు నమ్రత 15 ఏళ్ళుగా తెలుసని.. ఆమె గొప్ప వ్యక్తి.. గొప్ప తల్లి.. మహిళలకు ఆమె స్పూర్తిదాయకంగా ఉంటారని ట్వీట్ చేశారు. ఇన్ డైరెక్ట్ గా నమ్రతకు ఈ కేసుకి ఎలాంటి సంబంధాలు ఉండవని ట్వీట్ తో చెప్పకనే చెప్పాడు బండ్ల గణేష్.                 Related Post

సినిమా స‌మీక్ష