యువ హీరోకి నాగార్జున ఛాన్స్..?

September 23, 2020


img

కింగ్ నాగార్జున హీరోగానే కాదు సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా.. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ.. స్మాల్ బడ్జెట్ సినిమాలతో తన టేస్ట్ ఏంటన్నది చూపిస్తాడు నాగార్జున. ఈమధ్య అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలు తీయడంలో కాస్త వెనక్కి తగ్గిన నాగ్ కొత్తగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. యువ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజ్ తరుణ్ మొదటి సినిమా ఉయ్యాల జంపాల నాగార్జుననే నిర్మించారు.               

ఆ సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చి కుమారి 21f, ఆడోరకం ఈడోరకం సినిమాతో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమాలైతే చేశాడు కాని అందుకు తగినట్టుగా సక్సెస్ లను అందుకోలేదు. అక్టోబర్ 2న ఒరేయ్ బుజ్జిగా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్ నాగార్జున నిర్మాణంలో సినిమా చేస్తున్నారు. మరి ఈ  సినిమాతో రాజ్ తరుణ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష