రెండు నెలలు కేటాయించిన అలియా భట్..!

September 22, 2020


img

రాజమౌళి డైరక్షన్ లో ఎన్టీఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ RRR. ప్రీ లుక్ పోస్టర్.. అల్లూరి టీజర్ తో సినిమా అరుపులే అనిపించిన రాజమౌళి త్వరలోనే ఎన్.టి.ఆర్ కు సంబందించిన టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అలియా భట్ పోర్షన్ త్వరలో షూట్ చేస్తారని తెలుస్తుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత త్వరలో RRR షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు రాజమౌళి. ఈ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్నారు. RRR కోసం రెండు నెలలు కేటాయించిందట అలియా భట్. షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం అలియా భట్ సీన్స్ అన్ని షూట్ చేస్తారని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత పరిమిత సభ్యులతో షూటింగ్ కు అనుమతి ఇచ్చారు. అయితే RRR పెద్ద సినిమా కాబట్టి టీం కూడా చాలా ఉండాలి. అందుకే షూటింగ్ కు లేట్ చేస్తున్నారు. కరోనా నుండి కోలుకున్న రాజమౌళి త్వరలోనే ట్రిపుల్ ఆర్ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.      Related Post

సినిమా స‌మీక్ష