'మహానటి' శృతిహాసన్

September 22, 2020


img

థియేటర్ లు మూతపడటం వల్ల వెబ్ సీరీస్ ల హవా కొనసాగుతుంది. అందుకు ఓటిటి ఫ్లాట్ ఫాంలు కూడా భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్స్ కూడా వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ కు సై అంటున్నారు. ఇప్పటికే సమంత, రకుల్, తమన్నా, కాజల్ వంటి స్టార్స్ వెబ్ సీరీస్ లు చేస్తుండగా లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో శృతి హాసన్ కూడా చేరింది. నెట్ ఫ్లిక్స్ తో శృతి హాసన్ ఓ వెబ్ మూవీ చేస్తుందని తెలుస్తుంది. ఈ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తునారని తెలుస్తుంది. 

మహానటి సినిమాతో డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అశ్వనిదత్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ సినిమా చేస్తున్నాడు కాబట్టి అప్పటివరకు నాగ్ అశ్విన్ వెబ్ సీరీస్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. 45 నిమిషాలు మాత్రమే ఉండే ఈ వెబ్ మూవీకి సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలియాల్సి ఉంది. కొద్దిపాటి గ్యాప్ తో తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న శృతి హాసన్ పవర్ స్టార్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్ సినిమాల్లో నటిస్తుంది.    Related Post

సినిమా స‌మీక్ష