ఇదే బిగ్ బాస్ కు కావాల్సింది..!

September 22, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4లో గడిచిన రెండు వారాలు సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చారు హౌజ్ మేట్స్. సండే రోజు మీరంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారని.. నామినేషన్స్ కూడా సీరియస్ గా తీసుకోవట్లేదని హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఎపిసోడ్ లో హౌజ్ మేట్స్ అంతా అసలైన ఆట మొదలు పెట్టారు. సోమవారం నామినేషన్స్ లో భాగంగా హౌజ్ మేట్స్ అందరి ముందే తాము నామినేట్ చేసే ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు అందుకు కారణాలు చెప్పాలని బిగ్ బాస్ నిర్ణయించారు. అంతేకాదు నామినేట్ చేసే హౌజ్ మేట్స్ ఫోటోలను నిప్పుల్లో వేయాల్సి ఉంటుంది. 

ఈ నామినేషన్స్ టాస్క్ లో అఖిల్, కుమార్ సాయి.. సుజాత, హారిక.. సోహైల్, అరియానాల మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది. కరాటే కళ్యాణి వెళ్తూ వెళ్టూ దేవి నాగవల్లిని నామినేట్ చేయగా.. కెప్టెన్ అయినందుకు నోయెల్ డైరెక్ట్ గా ఒక ఇంటి సభ్యుడిని నోయెల్ నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించగా అందుకు లాస్యని నామినేట్ చేశాడు నోయెల్. మొత్తానికి ఈ వారం కూడా ఏడుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో నిలిచారు. అందులో కుమార్ సాయికి 7, అరియానాకు 7 ఓట్లు రాగా.. మెహబూబ్ కు 4, హారికకు 3, మోనాల్ కు 3 ఓట్లతో నామినేషన్స్ లో ఉన్నారు. దేవి, లాస్యలతో కలిపి ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష