ప్రభాస్ సినిమాకు సింగీతం శ్రీనివాస్..!

September 21, 2020


img

బాహుబలి తర్వాత తను తీసే సినిమాలన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో అలానే రిలీజ్ చేసి ఇక్కడ వర్క్ అవుట్ కాకపోయినా బాలీవుడ్ లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యాం సినిమా కూడా భారీ రేంజ్ లోనే వస్తుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఈలోగా బాలీవుడ్ నుండి ఆఫర్ రావడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్.     

ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తాడని తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబో మూవీని వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా సింగీతం శ్రీనివాస రావుని తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన సింగీతం శ్రీనివాస రావు సహకారం ఈ సినిమాకు ఉపయోగపడుతుందని నిర్మాతలు భావించారు. అందుకే ఆయన్ను ఒప్పించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ సినిమాకు ఆయన పనిచేస్తున్న విషయాన్ని ప్రకటించారు.  Related Post

సినిమా స‌మీక్ష