దశరథుని వంశ వృక్ష్యం.. ఇది కరాటే కళ్యాణి టాలెంట్..!

September 21, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4లో రెండో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. 9 మంది హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉండగా వారిలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం రెండు ఎలిమినేషన్స్ అంటూ షాక్ ఇచ్చిన నాగార్జున హారికని ఎలిమినేట్ చేసి చివరకి తూచ్ ఇదంతా ఉత్తిత్తే అనేశాడు. నామినేషన్స్ ను సీరియస్ గా తీసుకోవాలన్న ఉద్దేశంతో అలా చేసినట్టు చెప్పుకొచ్చారు.

ఇక ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి స్టేజ్ మీద తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. విశ్వామిత్రుడు దశరథ మహారాజుని సాయం అడిగితే.. ఆ టైం లో దశరథ మహరాజు ముందు సరే అని ఆ తర్వాత ఆట తప్పుతాడు అలాంటి టైం లో విశ్వామిత్రుడు దశరథ మహరాజు వంశ వృక్ష్యం చెబుతాడు. దశరథుని వంశ వృక్ష్యం గురించి కరాటే కళ్యాణి సింగిల్ టేక్ లో చెప్పడం నాగార్జున సైతం ఫెంటాస్టిక్ అనేలా షేసింది. 

అంతేకాదు ఈ టాలెంట్ ఏదో హౌజ్ లో చూపిస్తే ఆమె ఎలిమినేట్ అయ్యేది కాదని అనుకున్నారు ఆడియెన్స్. ఫైనల్ గా 16 మంది ఉన్న ఇంటి సభ్యులలో ఇద్దరు ఎలిమినేట్ కాగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ 16 మంది కంటెస్టంట్స్ హౌజ్ లో ఉన్నారు.           Related Post

సినిమా స‌మీక్ష