అనుష్క 'నిశ్శబ్ధం' ట్రైలర్ రిలీజ్..!

September 21, 2020


img

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నిశ్శబ్ధం. ఈ సినిమాలో మాధవన్, అనన్యా పాండేలు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. కోనా వెంకట్ నిర్మించిన ఈ సినిమా కొన్నాళ్ళుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ జరుగగా ఫైనల్ గా అమేజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. రెండు వారాల్లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.

తెలుగులో నిశ్శబ్ధం ట్రైలర్ ను దగ్గుబాటి రానా రిలీజ్ చేయగా.. తమిళంలో విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమాలో విషయం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. హర్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డమ్ రోల్ లో నటిస్తుంది. భాగమతి తర్వాత అనుష్క నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ తో అంచనాలు డబుల్ అయ్యాయని చెప్పొచ్చు.  

 

 


Related Post

సినిమా స‌మీక్ష