సాయి పల్లవి @ 2 కోట్లు

September 19, 2020


img

నాచురల్ హీరోయిన్ గా ఈమధ్య సూపర్ పాపులర్ అయిన కథానాయిక సాయి పల్లవి. మళయాళ ప్రేమం సినిమాతో క్రేజ్ తెచ్చుకుని తెలుగులో ఫిదా సినిమాతో ఆడియెన్స్ ను నిమగానే ఫిదా చేసిన ఈ అమ్మడు వరుస క్రేజీ సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో లవ్ స్టోరీ.. రానాతో విరాటపర్వం సినిమాలు చేస్తుంది. రెండు సినిమాలు రెండు జానర్లుగా వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమాలో ఛాన్స్ అందుకుందట సాయి పల్లవి. 

టాక్సీవాలా సినిమాతో టాలెంట్ చూపించిన రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో నాని హీరోగా భారీ బడ్జెట్ తో శ్యాం సింగ రాయ్ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ అవరం ఉన్నారని తెలుస్తుంది. మెయిన్ లీడ్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారట. అయితే సినిమాలో నటించడానికి సాయి పల్లవి 2 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. సాయి పల్లవి మాత్రమే చేయగలిగే పాత్ర కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి సై అన్నారట దర్శక నిర్మాతలు. మొత్తానికి ఫిదా భామ జోరు అలా కొనసాగుతుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష