ఒక సుకుమార్.. 9 ప్రేమ కథలు..!

September 19, 2020


img

టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన రైటింగ్ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్న సుకుమార్ ఈ సినిమాతో పాటుగా నిఖిల్ తో 18 పేజెస్ అంటూ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. ఇక ఈమధ్య ఓటిటి ఫ్లాట్ ఫాం పై వెబ్ సీరీస్ ల సందడి బాగుంది. అందుకే సుకుమార్ కూడా అక్కడ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

సుకుమార్ రాసిన 9 లవ్ స్టోరీస్ వెబ్ సీరీస్ గా రాబోతుందట. ఈ 9 ప్రేమ కథలను 9 భాగాలుగా చేసి వెబ్ సీరీస్ చేస్తున్నారట. ఈ వెబ్ సీరీస్ లను కుమారి ఫేమ్ సూర్య ప్రతాప్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ 9 లవ్ స్టోరీస్ లో 9 జోడీలు నటిస్తాయని తెలుస్తుంది. ఒక సుకుమార్ 9 ప్రేమ కథలు.. కాన్సెప్ట్ అదిరిపోగా మరి సుకుమార్ రాసే ప్రేమ కథలు ఆర్యాలా డిఫరెంట్ గా ఉంటాయా అని ఎక్సయిట్మెంట్ ఆడియెన్స్ లో మొదలైంది.   Related Post

సినిమా స‌మీక్ష