మేనల్లుడు సినిమాలో పవర్ స్టార్..?

September 17, 2020


img

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ఓటిటి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత దేవా కట్టా డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే మరో లాంగ్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

సాయి ధరం తేజ్ కెరియర్ లో స్పెషల్ గా ఉండేలా ఈ సినిమాను చేస్తున్నాడు దేవా కట్టా. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాక్. మేనల్లుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఇది నిజంగా జరిగితే మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. సినిమాలో కథను మలుపు తిప్పే ఓ పాత్రలో పవర్ స్టార్ ను తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారట. పవన్ ఆల్రెడీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేయాల్సిన సినిమాలే చాలా ఉన్నప్పుడు సాయి ధరం తేజ్ సినిమాలో నటించే ఛాన్సే లేదని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష