మహేష్ చెప్పాడు విజయ్ చేశాడు..!

August 11, 2020


img

సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే రోజు స్పెషల్ గా తన పెరట్లో మొక్క నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు కోలీవుడ్ హీరో విజయ్, తెలుగు స్టార్ హీరో ఎన్.టి.ఆర్ ను నామినేట్ చేశాడు. మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ తన ఇంట్లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ అద్భుతమైన కార్యక్రమమని.. ప్రముఖులంతా భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే మన దగ్గర సగటు మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కు సరిపడే మొక్కలు లేవని అన్నారు విజయ్.          

దీనివల్లే దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు తయారయ్యాయని.. మన మొక్కలు నాటడంలో ఎంత అశ్రద్ధం చూపుతున్నామో తెలియడానికి అది ఒక నిదర్శనమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వారికి మొక్కలు నాటమని కోరడం.. ఒకరి ద్వారా ఒకరు గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం జరుగుతుంది. తను ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు విజయ్. తనని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసిన మహేష్ గారికి కృతజ్ఞతలు చెప్పారు విజయ్. మహేష్ చెప్పగానే విజయ్ ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఇందుకు విజయ్ కు థ్యాంక్స్ అలాట్ బ్రదర్ ఫర్ టేకింగ్ అప్.. స్టే సేఫ్ అని మరో మెసేజ్ పెట్టారు మహేష్.                 

 


Related Post

సినిమా స‌మీక్ష