100 కోట్ల రెమ్యునరేషన్..!

August 11, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. జిల్ ఫేమ్  రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ డిమాండ్ చేస్తున్నాడట.            

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. సౌత్ లోనే కాదు ఇండియన్ సూపర్ స్టార్స్ లో కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఒకే ఒక్క హీరో ప్రభాస్ అని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది ఈ సినిమా రెమ్యునరేషన్ తో తెలుస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు దీపికా పదుకొణెకి కూడా 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ రెమ్యునరేషన్ తో అదరగొట్టేస్తున్నాడు.        

 


Related Post

సినిమా స‌మీక్ష