రవితేజ రెమ్యునరేషన్ డిమాండ్..!

August 11, 2020


img

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఏమాత్రం ఫామ్ లో లేడు. రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం తపిస్తున్న మాస్ రాజా ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్నారు. క్రాక్ టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరక్షన్ లో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఇదే కాకుండా M.C.A డైరక్టర్ నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో కూడా సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా రవితేజ 10 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. వరుస ఫ్లాపులు వస్తున్నా సరే రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదని అంటున్నారు సిని విశేషకులు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తున్నాడు. మొన్నటిదాకా 8 కోట్ల వరకు తీసుకున్న మాస్ రాజా ఇప్పుడు 10 కోట్లు ఇస్తేనే అంటూ డిమాండ్ చేస్తున్నాడట.               



Related Post

సినిమా స‌మీక్ష