బాలకృష్ణ సినిమాలో ఎన్టీఆర్..?

August 11, 2020


img

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. మొన్నమధ్య టీజర్ తో మెప్పించిన బాలయ్య బాబు ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని తెలుస్తుంది. బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే సూపర్ హిట్టు.. అలాంటిది వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది.    

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఓ యువ హీరో పాత్ర కూడా ఉంటుందని టాక్. ఈ పాత్రకు నాగ శౌర్య, కళ్యాణ్ రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. కాని లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను నటించేలా చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చిందట బోయపాటికి. ఆలోచన రావడమే ఆలస్యం బాలకృష్ణకు చెప్పడం ఆయన ఓకే అనడం జరిగిందట. బాలయ్య సినిమాలో ఎన్.టి.ఆర్ నటిస్తే వాళ్లిద్దరిని ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ హంగమా వేరే రేంజ్ లో ఉంటుంది.            



Related Post

సినిమా స‌మీక్ష