బర్త్ డే రోజు సర్ ప్రైజ్ అదే..!

August 04, 2020


img

ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా సరారు వార్ పాట నుండి స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు డైరక్టర్ పరశురాం. స్టార్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు పండుగ రోజునే పోస్టరో.. టీజరో రిలీజ్ చేస్తారు. అలాంటిది స్టార్ బర్త్ డే అయితే ఆ హంగామా వేరేలా ఉంటుంది. ఈ నెల 9న మహేష్ బర్త్ డేకి సర్కారు వారి పాట నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేస్తారట. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈమధ్య ఫుల్ ఫాంలో ఉన్న థమన్ మహేష్ తో ఆల్రెడీ సూపర్ హిట్ సినిమాలు చేశాడు. మరోసారి ఈ కాంబినేషన్ లో మ్యూజిక్ సూపర్ హిట్ కొట్టేలా ఉంది. గీతా గోవిందం తర్వాత రెండేళ్ళు వెయిట్ చేసి మరి సూపర్ స్టార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పరశురాం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. మరి బర్త్ డే రోజు వచ్చే సాంగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ డే చేస్తుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష