అఖిల్ 'బ్యాచ్ లర్' శాటిలైట్ రేటు అదిరింది..!

August 04, 2020


img

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ డిజిటల్ రైట్స్ తో దుమ్ముదులిపేసిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ లో కూడా అదరగొట్టేసింది. అఖిల్ బ్యాచ్ లర్ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా సొంతం చేసుకుందని తెలుస్తుంది. 6.5 కోట్లకు అఖిల్ సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. 

అఖిల్ నుండి మిస్టర్ మజ్ను వరకు తీసిన 3 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేని అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన రొమాంటిక్ పోస్టర్ కూడా ఆడియెన్స్ ను అలరించింది. మరి అఖిల్ ఈ సినిమాతో అయినా హిట్టు కొడతాడా లేక మళ్ళీ నిరాశపరుస్తాడా అన్నది చూడాలి.       



Related Post

సినిమా స‌మీక్ష