పవర్ స్టార్ మళ్ళీ పోలీస్ పాత్రలో..!

August 03, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత క్రిష్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ పోలీస్ పాత్రలో అలరించారు. ఇక మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అవగా ఈ మూవీలో కూడా పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తారని తెలుస్తుంది.     

ఇప్పటికే హరీష్ శంకర్ ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేయగా ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్న హరీష్ శంకర్ ఈ సినిమాలో పవర్ స్టార్ ను ఎలా చూపిస్తాడో చూడాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష