ప్రభాస్ 21కి రెహమాన్..!

August 03, 2020


img

మహానటి తర్వాత డైరక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ లో ఉన్నారు. సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని ఫిక్స్ చేశారు. సినిమాలో ఆమె నటించడానికి 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కు నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. 

ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణి, రెహమాన్ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయాలని అనుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ప్రభాస్ 21కి మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ ని ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నందుకు గాను రెహమాన్ కు 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. మొత్తానిక్ ఇంటర్నేషనల్ రేంజ్ కథకు ఆ రేంజ్ టెక్నికల్ టీం ను సెట్ చేసుకుంటున్నాడు నాగ్ అశ్విన్. Related Post

సినిమా స‌మీక్ష