డైరక్టర్ తేజకు కరోనా పాజిటివ్..!

August 03, 2020


img

ఇప్పటికే టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ రాజమౌళి అతని ఫ్యామిలీ కరోనా బారిన పడగా.. లేటెస్ట్ గా తెలుగు పరిశ్రమలో మరో దర్శకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రముఖ తెలుగు దర్శకుడు తేజ ఈమధ్య షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళి రాగా ఆ తర్వాత వెబ్ సీరీస్ కు సంబందించిన పనులు చూస్తున్నారు. మొదటి ఎపిసోడ్ షూటింగ్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కొద్దిగా సిమ్టమ్స్ రావడంతో ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తె కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది.      

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు డైరక్టర్ తేజ. తన టీమ్ లో కాని, కుటుంబ సభ్యులలో కాని ఎవరిక్ పాజిటివ్ రాలేదని చెప్పారు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెళ్లడించారు. తేజాకు కరోనా పాజిటివ్ అని తేలగానే ఇండస్ట్రీ అంతా భయపడుతుంది. ఓ వెబ్ సీరీస్ షూటింగ్ తోనే డైరక్టర్ తేజకి కరోనా రావడం జరిగింది. ఈ టైమ్ లో సినిమా షూటింగ్స్ మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు.   Related Post

సినిమా స‌మీక్ష