లాక్ డౌన్ లో సమంత నేర్చుకున్న పాఠం..!

July 31, 2020


img

కరోనా లాక్ డౌన్ వల్ల తను నేర్చుకున్న పాఠం గురించి చెప్పుకొచ్చింది అక్కినేని కోడలు సమంత. లాక్ డౌన్ అని ప్రకటించగానే తను, చైతన్య వెళ్ళి అవసరమైనవి తెచ్చుకున్నామని కాని అవి కొన్నాళ్ళ వరకే వచ్చేలా ఉన్నాయని తెలుసుకుని ఆ తర్వాత ఆలోచించి ఇంట్లోనే మనకు కావాల్సినవి తయారు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వ్యవసాయం మొదలు పెట్టానని అంటుంది సమంత.

కరోనా లాక్ డౌన్ తనకు ఓ మంచి పాఠం నేర్పించిందని అంటుంది సమంత. ప్రతి ఒక్కరు క్రియేటివ్ గా ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. కొందరు డ్యాన్స్ వేస్తారు.. కొందరు వంట వండుతారు కాని తనకు అవేవి రావు కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగకరమైనది చేయాలని అనుకున్నా అందుకే తోటపని.. వ్యవసాయం చేశానని చెప్పారు సమంత.  Related Post

సినిమా స‌మీక్ష