టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కు సెలెక్ట్ అయిన జెర్సీ..!

July 31, 2020


img

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇదే సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో షాహిద్ కపూర్ హిందీ జెర్సీలో నటిస్తున్నారు. నాని జెర్సీ ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆగష్టు 9 నుండి 15 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు నుండి జెర్సీ పదర్శించబడుతుంది.

ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో సూపర్ 30, కార్తి నటించిన ఖైది (తమిళం) సినిమాలు కూడా ప్రదర్శించబడతాయని తెలుస్తుంది. నాని జెర్సీ ప్రేక్షకుల మనసులు గెలవడమే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సెలెక్ట్ అయ్యి సినిమా సత్తా ఏంటో చాటింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ గా నిలిచింది. జెర్సీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. Related Post

సినిమా స‌మీక్ష