అందుకు నో చెబుతున్న అనుష్క..!

July 31, 2020


img

ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకుంటే బాధపడేవారు.. ఇప్పుడు టాలెంట్ ఉండి సినిమాల్లో ఛాన్సులు లేకపోయినా ఓటిటి, ఏటిటిలు ఆఫర్లు ఇస్తున్నాయి. వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లు ఓ రేంజ్ లో వస్తున్నాయి. యువ టాలెంటెడ్ నటీనటులంతా ఇప్పుడు సినిమా ఛాన్సులు లేకపోయినా సరే వీటితో కెరియర్ సాగిస్తున్నారు. ఓటిటిలో వీటికున్న క్రేజ్ చూసి స్టార్ హీరోయిన్స్ సైతం వెబ్ సీరీస్ లకు సై అనేస్తున్నారు. 

ఇప్పటికే సౌత్ హీరోయిన్స్ సమంత, కాజల్, రకుల్ వంటి హీరోయిన్స్ అంతా వెబ్ సీరీస్ లకు ఓకే చెప్పగా లేటెస్ట్ గా అనుష్క కూడా వెబ్ సీరీస్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్నేషనల్ డిజింటల్ స్ట్రీమింగ్ సంస్థ అనుష్కతో అన్ని భాషల్లో వచ్చేలా ఓ భారీ వెబ్ సీరీస్ ప్లన్ చేశారట అయితే ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది అమ్మడు. చేస్తే సినిమాలు చేస్తా లేదంటే ఖాళీగా ఉంటానన్నట్టు అమ్మడి సమాధానం ఉందట. భాగమతి తర్వాత గ్యాప్ ఇచ్చి నిశ్శబ్ధం సినిమా చేసిన అనుష్క ఆ సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు. తమిళంలో మాత్రం రెండు సినిమాలకు సైన్ చేసినట్టు టాక్.  Related Post

సినిమా స‌మీక్ష