సాయి తేజ్ సినిమాకు ఓటిటి ఆఫర్..!

July 31, 2020


img

మెగా మేనల్లుడు సాయి తేజ్ చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నడు సాయి తేజ్. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకూలంగా ఉండి ఉంటే ఈ టైం కు రిలీజ్ అయ్యి ఉండాల్సింది. ఈ ఇయర్ సమ్మర్ టార్గెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు. అందుకే సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

మీడియం, మినిమం బడ్జెట్ సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ప్రముఖ ఓటిటి సంస్థ సాయి తేజ్ సినిమాకు ఓ భారీ ఆఫర్ ఇచ్చిందట. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు ఓటిటి ద్వారా 20 నుండి 25 కోట్ల దాకా ఆఫర్ వచ్చిందట. ఎలాగు మళ్ళీ శాటిలైట్ రైట్స్ కూడా ఉంటాయి కాబట్టి చిత్రయూనిట్ ఈ ఆఫర్ కు టెంప్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. నిజంగానే సాయి తేజ్ సినిమా ఓటిటి రిలీజ్ కన్ ఫాం అయితే డిజిటల్ ఫ్లాట్ ఫాం లో రిలీజ్ అవుతున్న మొదటి తెలుగు స్టార్ హీరో సినిమా అదే అవుతుంది.Related Post

సినిమా స‌మీక్ష