నో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..!

July 30, 2020


img

బిగ్ బాస్ సీజన్ 4కు రంగం సిద్ధం చేస్తున్నారు స్టార్ మా నిర్వాహకులు. సీజన్ 3 హోస్ట్ గా చేసిన నాగార్జున ఈ సీజన్ ను కూడా హోస్ట్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నందుకు నాగ్ భారీ మొత్తాన్నే రెమ్యునరేషన్ గా పొందుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. 50 రోజులు మాత్రమే జరిగే ఈ సీజన్ లో 15 మంది కంటెస్టంట్స్ గా వస్తున్నారని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉండవని తెలుస్తుంది. మొదటి, రెండు, మూడవ సీజన్ లో స్టార్ కంటెస్టంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బిగ్ బాస్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదని తెలుస్తుంది. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష