కీర్తి సురేష్, రష్మికలకు సమంత ఛాలెంజ్..!

July 11, 2020


img

 తెలంగాణా ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనేందుకు సిని తారలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనగా లేటెస్ట్ గా మామయ్య నాగార్జునతో కలిసి ఈ ఛాలెంజ్ లో పాల్గొంది అక్కినేని కోడలు సమంత. నాగార్జున విసిరిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సాం మామతో కలిసి తమ నివాసంలో మూడు చెట్లను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని.. కాలుష్యానికి బ్రేక్ వేయాలంటే ఇది ఒక వెపన్ గా పనిచేస్తుందని అన్నారు. 

తన అభిమానులందరు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మూడు మొక్కలను నాటాలని అన్నారు. ఇక తను పూర్తి చేసిన ఈ ఛాలెంజ్ కు మహానటి కీర్తి సురేష్, రష్మిక మందన్నలను నామినేట్ చేస్తూ వారిద్దరిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని కోరింది సమంత.  


Related Post

సినిమా స‌మీక్ష