మెగా హీరోతో మరో 'ప్రస్థానం'

July 11, 2020


img

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా ప్రస్థానం ఫేమ్ దేవా కట్ట డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్థానం తర్వాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసిన దేవా కట్ట వాటితో తన మార్క్ చూపించలేకపోయాడు. అయితే సాయి తేజ్ సినిమా సబ్జెక్ట్ చాలా పకడ్బందీగా రాసుకున్నాడట. అంతేకాదు సినిమాలో హీరో పాత్ర చాలా టిపికల్ గా ఉంటుందని టాక్.

సాయి తేజ్ ఇప్పటివరకు నటించిన అన్ని పాత్రలకు భిన్నంగ దేవా కట్టా తన హీరో పాత్ర రాసుకున్నాడట. దేవా కట్టా మెగా హీరోతో మరో ప్రస్థానం చేస్తున్నాడంటూ అప్పుడే వార్తలు జోరందుకున్నాయి. వరుసగా ఆరు సినిమాల ఫ్లాప్ తర్వాత చిత్రలహరితో హిట్టు కొట్టి ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి తేజ్ దేవా కట్ట సినిమాతో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష