విలన్ ని కాపాడిన హీరో..!

July 11, 2020


img

రీల్ హీరోగా నటించే వాళ్లు చాలా తక్కువమంది రియల్ హీరోగా తమ మంచితనాన్ని చాటుకుంటారు. స్టార్స్ ఎప్పుడు సహాయం చేయడంలో ముందుంటారు. లేటెస్ట్ గా విలన్ ను కాపాడటానికి హాస్పిటల్ ఖర్చులను, కుటుంబ బాధ్యతలను తను చూసుకుంటానని హామి ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్. తెలుగు, తమిళ భాషల్లో విలన్ గా చాలా సినిమాల్లో నటించిన పొన్నాంబ‌ళ‌మ్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడట. కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేవట. కమల్ హాసన్ ఈ విషయాన్ని తెలుసుకుని ఆయనకు అవసరమైన ట్రీట్ మెంట్ జరిగేలా చూస్తున్నారట.

అంతేకాదు తన టీం తో చెప్పి పొన్నాంబ‌ళ‌మ్ ఇంటి బాధ్యతలను చూసుకోమని చెప్పారట. రెండు రోజులుగా పొన్నాంబ‌ళ‌మ్ ఐసియులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారట కమల్ హాసన్. కమల్ చేస్తున్న ఈ మంచి పనికి ఆయన అభిమానులే కాదు అందరు మెచ్చుకుటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష