అసలు కట్టప్ప ఆయనేనా..?

July 11, 2020


img

తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, సత్య రాజ్, అనుష్క, తమన్నా ఈ సినిమా ముందుకు వరకు సౌత్ స్టార్స్ మాత్రమే కాని బాహుబలి తర్వాత వారు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు. ఈ సినిమాలో ప్రభాస్, రానాల తర్వాత అంత గుర్తింపు తెచ్చుకున్న పాత్ర కట్టప్ప. మొదటి పార్ట్ తర్వాత వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న చాలా పాపులర్ అయ్యింది. 

సీనియర్ స్టార్ సత్యరాజ్ కట్టప్ప పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. జూలై 10 2015 సరిగా నిన్నటికి బాహుబలి బిగినింగ్ రిలీజై ఐదేళ్లు అవుతుంది. ఈ టైం లో సినిమాకు సమబందించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో సత్య రాజ్ పోశించిన కట్టప్ప పాత్రకు మొదట రాజమౌళి బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ ను అనుకున్నారా. కాని అప్పుడు ఆయన జైల్లో ఉండటం వల్ల అనుకున్న విధంగా సినిమా చేయడం కుదరక ఆలోచన మానుకున్నారట రాజమౌళి. సత్య రాజ్ చేసిన కట్టప్ప పాత్ర సంజయ్ దత్ చేసి ఉంటే మాత్రం ఆ క్రేజ్ వేరేలా ఉండేదని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష