ఎలాంటి భర్త కావాలంటే..!

July 10, 2020


img

సౌత్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ భాషల్లో తన మార్క్ చూపించింది. అయితే తెలుగులో మన్మథుడు 2 తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్సులు అందుకోని రకుల్ బాలీవుడ్ లో ఛాన్సుల కొసం ప్రయత్నిస్తుంది. యువ హీరో నితిన్ కు జోడీగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా ఓకే చేసిన రకుల్ మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఇదిలాఉండగా రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు రాబోయే భర్త ఎలా ఉండాలో కూడా ఆడియెన్స్ తో పంచుకుంది. హై హీల్స్ వేసుకున్నా సరే తను తలేత్తుకి చూసేలా ఉండాలని అంటుంది. అంతేకాదు మంచి మనసు ఉండి.. ఏదైనా గొప్ప పని చేసి ఉండాలని అంటుంది రకుల్. మరి అమ్మడు సడెన్ గా కాబోయే భర్త గురించి చెబుతుంది అంటే త్వరలో పెళ్లి వార్త ఏదైనా చెబుతుందేమో అని చెప్పుకుంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష