RRR 5 నిమిషాల ఫైట్.. అదిరిపోతుందట..!

July 10, 2020


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ కనిపించనున్నారు. ఇద్దరు రియల్ ఫ్రీడం ఫైటర్స్ జీవితకథలకు కల్పితాన్ని జోడించి ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సినిమా నుండి లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ తారక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో కొమరం భీం పాత్ర చేస్తున్న తారక్ తో భారీ ఫైట్ సీన్ ఉంటుందట. సినిమాల్లో ఉన్న అద్భుతమైన సన్నివేశాల్లో అది ఒకటని తెలుస్తుంది. 5 నిమిషాల ఫైట్ కు భారీగా ఖర్చు పెడుతున్నారట. ఈ ఒక్క ఫైట్ కోసమైనా నందమూరి ఫ్యాన్స్ రిపీటెడ్ గా ఈ సినిమా చూస్తారని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష